సౌర కళలు సూపర్‌

9 Dec, 2023 04:51 IST|Sakshi

అపురూపమైన ఫొటోలు తీసిన ఆదిత్యఎల్‌1  

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):  సూర్యునిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం అపూర్వమైన ఫొటోలను అందించింది. తొలిసారిగా సూర్యుని ఫుల్‌ డిస్క్‌ ఇమేజీలను భూమికి పంపింది. ఉపగ్రహంలోని సోలార్‌ అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌) విజయవంతంగా ఈ ఫొటోలు తీసినట్టు ఇస్రో శుక్రవారం పేర్కొంది. వాటిని తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఫొటోలను 200–400 ఎన్‌ఎం తరంగదైర్ఘ్య పరిధిలో తీసినట్టు వెల్లడించింది.

ఈ ఫొటోల్లో సూర్యుని తాలూకు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లను 11 వేర్వేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య ఎల్‌1 బందించింది. ఆ స్పియర్లపై లోతైన సమాచారాన్ని ఈ ఫొటోలు అందించినట్టు ఇస్రో తెలిపింది. భూ వాతావరణంపై సౌర ధారి్మకత ప్రభావం తదితరాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తాజా ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. వాటిలో సూర్య వలయాల వంటివి కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. గత సెపె్టంబర్‌ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుని దిశగా ప్రయాణంలో భాగంగా లాంగ్రేజియన్‌ పాయింట్‌1కు చేరింది. దీంట్లోని ఏడు పేలోడ్లను పూర్తిగా దేశీయంగానే రూపొందించారు.
 

>
మరిన్ని వార్తలు