ది అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ చైర్మన్‌గా రానా బారువా

15 Sep, 2023 20:31 IST|Sakshi

అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా పరిశ్రమకు చెందిన అపెక్స్‌ బాడీ అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ నూతన మేనేజింగ్‌ కమిటీని ప్రకటించింది. తమ 69వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-2034 సంవత్సరానికి సంబంధించి హవాస్‌ ఇండియా గ్రూప్‌ సీఈవో రానా బారువాను అధ్యక్షునిగా నియమించింది. మాజీ అధ్యక్షుడు పార్థ సిన్హా మేనేజింగ్‌ కమిటీ సభ్యునిగా కొనసాగనున్నట్లు అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తన నియామకం గురించి.. రానా బారువా మాట్లాడుతూ, “దాదాపు 70 చరిత్ర కలిగిన సంస్థ ది యాడ్ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త తరం, ఔత్సాహికులకు మెరుగైన సేవలు అందిచాలనేది తమ లక్ష్యమని.. ఇందుకోసం వివిధ రంగాల్లో వైవిధ్యమైన లీడర్స్‌ అపరిమిత అవకాశాల్ని, సేవల్ని అందించేందుకు తమ ఉత్తమమైన మేనేజ్‌మెంట్‌ టీమ్‌తో కలిసి ముందుకెళ్తామన్నారు. 

ఇండస్ట్రీలోని కొత్త ప్రతిభను ఆకర్షించడానికి, మహిళా సాధికారతకు, భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించడం, వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం, ఈక్విటీ, చేరికలను పెంచేందుకు ప్రగతిశీల పొత్తులు, సంభాషణలను ప్రోత్సహించడానికి తామంతా కలిసి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కట్టబడి ఉంటామని చెప్పారు.

అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు
► రానా బారువా - అధ్యక్షుడు
►ధీరజ్ సిన్హా - ఉపాధ్యక్షుడు
►డాక్టర్ భాస్కర్ దాస్ - కార్యదర్శి
 ►శశి సిన్హా - జాయింట్‌ కార్యదర్శి
 ►మిత్రజిత్ భట్టాచార్య - కోశాధికారి

మేనేజింగ్ కమిటీ సభ్యులు
►అవినాష్ కౌల్
►మాల్కం రాఫెల్
►ప్రశాంత్ కుమార్
►పునీత ఆరుముగం
►శుభ్రాంశు సింగ్
►సోనియా హురియా
► సుబ్రహ్మణ్యేశ్వర సమయం

కో-ఆప్టెడ్ పరిశ్రమ నిపుణులు
►అజయ్ కాకర్
►ప్రదీప్ ద్వివేది
►విక్రమ్ సఖుజా

డ్వర్టైజింగ్ క్లబ్‌ను మరింత ముందుకు నడిపేందుకు ప్రతిభ నైపుణ్యం, సంబంధిత విభాగాల్లో లోతైన అనుభవం ఆధారంగా ఎంపికైన మరికొంత మంది వ్యక్తులు  
► అజయ్ చాంద్వానీ
► అలోక్ లాల్
► అనూషా శెట్టి
► లులు రాఘవన్
► మన్షా టాండన్
►నిషా నారాయణన్
►రాజ్ నాయక్
►సత్యనారాయణ రాఘవన్
►వికాస్ ఖంచందాని

మరిన్ని వార్తలు