వామ్మో మరో కొత్త రకం వ్యాధి.. ఈ సారి పందులపై..

7 May, 2021 15:24 IST|Sakshi

ఐజ్వాల్‌: ఓ పక్క క‌రోనా మ‌హ‌మ్మారి వీర విహారం చేస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యాధి ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ రూపంలో  ఈశాన్య రాష్ట్రం మిజోరంను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్‌ కారణంగా మిజోరంలో పందులు వేల సంఖ్యల్లో మరణిస్తున్నాయి. గ‌త మార్చి 21న ఈ వ్యాధి వల్ల తొలి మ‌ర‌ణం న‌మోదు అయ్యింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1700 పైగా పందులు మృతిచెందినట్లు సమాచారం. ఈ వ్యాధి  కరోనా లానే  ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి విస్తరిస్తోంది.  ప్రస్తుతం ఇది మిజోరంలోని పలు ప్రాంతాలని భయపెడుతోంది.

ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ కార‌ణంగా మిజోరంలో గ‌త నెల రోజుల‌కుపైగా వేల సంఖ్యలో  పందుల మ‌ర‌ణించాయి.  దీని వల్ల రూ.6.91 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్ర‌భావం తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, పశువైద్య విభాగం సంయుక్త డైరెక్టర్ డాక్టర్ లాల్మింగ్‌థంగా మాట్లాడుతూ..  భయంకరమైన ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు మరింత వ్యాప్తి చెందుతోంది, అయితే కేంద్రంలో రోజువారీ మరణాల సంఖ్య కొన్ని వారాలుగా తగ్గుతున్న ధోరణిని చూపించింది. చనిపోయిన పందుల నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం సేకరించాము. ఈ మరణాలకు గల కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల ఏఎస్‌ఎఫ్‌ సంక్రమణ మూలాలు సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

( చదవండి: వైర‌ల్‌: రాక్ష‌సుల క‌న్నా దారుణంగా ప్ర‌వ‌ర్తించారు )

మరిన్ని వార్తలు