అల‌ర్ట్ : అయోధ్య‌కు పొంచి ఉన్న మ‌రో ముప్పు

31 Jul, 2020 14:55 IST|Sakshi

లక్నో :  ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా అయోధ్య‌కు వ‌ర‌ద ముప్పు పొంచి ఉన్న‌ట్లు సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ శుక్ర‌వారం హెచ్చ‌రించింది. గంగాన‌ది ప్ర‌ధాన ఉప‌న‌ది అయిన ఘగ్రా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుందని దీంతో అయోధ్యలో వరద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.  ఒక ప‌క్క రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోండ‌గా వ‌ర‌ద ముప్పు పొంచి ఉండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మ‌రోవైపు  పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్ వ‌చ్చిన విషయం తెలిసిందే. (అయోధ్య పూజారికి కరోనా)

ఆగస్టు 5న జ‌రిగే భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, 50 మంది అతిథులు కూడా పాల్పంచుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. భూమిపూజ ఘట్టాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయులు సైతం వీక్షించనున్నారు.  న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య  రామమందిరం త్రీడీ చిత్రాలను  ప్రపంచంలోనే అతిపెద్ద  17వేల చదరపుటడుగుల భారీ నాస్‌డాక్‌ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫెయిర్స్‌ కమిటీ అధ్యక్షుడు జగదీష్‌ షెహానీ వెల్లడించారు. (అయోధ్యలో హైఅలర్ట్‌)

మరిన్ని వార్తలు