ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్‌ రికార్డు

16 Oct, 2022 06:59 IST|Sakshi

న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు.

గిన్నిస్‌ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి రిషి నాథ్‌. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్,  ఐఏఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు.

ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్‌పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్‌ సీఎం వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు