'ముందు అమలు చేసి, తర్వాత ఆలోచించండి': బీజేపీ నేత

18 Jun, 2022 20:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన వరుణ్‌ గాంధీ కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ పథకాన్ని పరిగణలోనికి తీసుకునే ముందే వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకులేదంటూ ఆరోపణలు చేశారు

ఎటువంటి ముందుచూపు లేకుండా కొత్త పథకాన్ని తీసుకు వచ్చేసి...వ్వతిరేకత మొదలయ్యాక మళ్లీ పునరాలోచించడం వంటివి కొన్ని సున్నితమైన అంశాల్లో పనికి రాదంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. సాయుధ బలగాలు, భద్రతకు సంబంధించి యువత విషయానికి వస్తే...సాయుధ దళాల్లోని యువకులకు సైనికులుగా స్వల్పకాలిక ఉపాధి కల్పించడమే ఈ పథకంలో తీసుకొచ్చిన సరికొత్త మార్పు అని చెప్పారు.

ఐతే ఈ పథకం ద్వారా ముఖ్యంగా 75 శాతం మందినే రిక్రూట్‌ చేసుకుంటారని చెప్పారు.. పైగా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారని, ఆ తర్వత సాధారణ సైనికుల మాదిరి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని తెలిపారు. దీంతో యువత ఆందోళనలు చేపట్టిందన్నారు. ఐతే యువత చేస్తున్న ఆందోళనలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగానే నిరసనలు హింసాత్మకంగా మారాయన్నారు. 

(చదవండి: అగ్నిపథ్‌ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్‌)

మరిన్ని వార్తలు