చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌.. ఫుల్‌ టెన్షన్‌లో అధికారులు!

25 Dec, 2022 16:02 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వైరస్‌ కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నట్టు సమాచారం. 

ఇలాంటి తరుణంలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో, అధికారులు సదరు వ్యక్తికి టెస్టులు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని  షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న భారత్‌కు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. 

కాగా, బాధితుడు చైనా నుంచి రావడంతో సదరు ప్రైవేటు ల్యాబ్‌ సిబ్బంది వెంనే ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు.. సదరు యువకుడి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్‌ అరుణ్‌ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా అయితే నిర్ధారణ అయ్యింది కానీ.. వారికి యువకుడికి ఏ వేరియంట్‌ సోకిందో తెలియదు. దీంతో, అతడి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు