శశికళ రాజకీయ ప్రవేశంపై నిరసన గళాలు

31 May, 2021 15:06 IST|Sakshi

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. దీంతో ఏఐఏడీఎంకేలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.  ఆమె రాజకీయ ప్రవేశంతో పార్టీకి మేలు జరకపోగా..కీడు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

శశికళ రాజకీయ ప్రవేశం డీఎంకేకు మరింత మేలు చేసే ‍ ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడులోని రాజకీయ వర్గాలు ఇప్పుడు శశికళ తదుపరి చర్యపై నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

(చదవండి: చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ)

మరిన్ని వార్తలు