అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి

11 Jul, 2022 11:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువరికి గాయలవ్వగా.. వాహనాలు ధ్వసం అయ్యాయి. పళనిస్వామి నేతృత్వంలోని జనరల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వెలుపల పన్నీర్ సెల్వం మద్దతుదారులు నిరసన తెలిపారు.

పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని పన్నీర్‌ సెల్వం( ఓపీఎస్‌) వర్గం స్వాధీనం చేసుకుంది. తన వర్గం నేతలతో ఓపీఎస్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో అన్నాడీఎంకే ఆఫీస్‌ దగ్గర 144 సెక్షన్‌ విధించారు.
చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు