vaccine: చిన్నారులపై ఎయిమ్స్‌ ట్రయల్స్‌

7 Jun, 2021 13:51 IST|Sakshi

చిన్నారులపై  స్వదేశీ టీకా కోవాగ్జిన్ ట్రయల్స్

ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్‌తోపాటు,నాగ్‌పూర్‌ కేంద్రాల్లో పరీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా థర్డ్‌  వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న అంచనాల మధ్య  ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకాను అందించే ప్రక్రియను వేగవంతం చేసింది.  పిల్లలపై కరోనా టీకా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.  ఈమేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతితోపాటు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆమోదం కూడా పొందింది. సోమవారం (జూన్ 7) నుండి  స్క్రీనింగ్‌  ప్రారంభించనుంది.

ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.12 నుంచి18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రివర్స్‌ ఆర్డర్‌లో ఎంపిక చేసిన చిన్నారులను మొదటి టీకా డోస్‌ ఇవ్వనున్నామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత  6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు, అనంతరం 2-6  సంవత్సరాల  పిల్లలకు పరీక్షలకు నిర్వహించనున్నామని తెలిపారు.  అలాగే 2 నుండి 18 సంవత్సరాల పిల్లలకు టీకా పరీక్షలు జూన్ 3 నుంచి  బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయని ఎయిమ్స్ పాట్నా సూపరింటెండెంట్ , ప్రిన్సిపల్ ట్రయల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సింగ్‌తె తెలిపారు.

కోవిడ్-19 వ్యాక్సిన్‌పై పరీక్షలు  నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ  వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌  టీకా మొదటి డోసును ఇప్పటివరకు 10 మంది పిల్లలు స్వీకరించారు.  మరో  28 రోజుల్లో రెండవ మోతాదు పొందనున్నారు. కోవాక్సిన్  ట్రయల్  టీకాను కనీసం 100 మంది పిల్లలకు ఇవ్వాలనేది లక్ష్యం.  ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్‌తోపాటు, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్‌పూర్‌ కేంద్రాలు ఈ పరీక్షల కోసం షార్ట్ లిస్ట్‌ చేసిన జాబితాలోఉన్నాయి. 

చదవండి : వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్

Petrol, diesel price today: కొనసాగుతు‍న్న పెట్రో సెగ

మరిన్ని వార్తలు