దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ

11 Feb, 2024 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్‌ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega