పాక్‌ మహిళ హనీట్రాప్‌.. దేశ భద్రతను రిస్కూలో పెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి

12 May, 2022 19:38 IST|Sakshi

దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్‌ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్​లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. సోషల్‌ మీడియాలో శర్మను పాక్‌ మహిళ ట్రాప్‌ చేసినట్టు గుర్తించారు.  

దేవేంద్ర శర‍్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్‌ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్‌ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్‌ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి..

మరిన్ని వార్తలు