అఫ్గనిస్తాన్‌: మొదలైన తరలింపు.. స్వదేశానికి 85 మంది భారతీయులు

21 Aug, 2021 12:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడంతో ఆ దేశంలో ఉన్న భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ఇవాళ మొద‌లైంది. వైమానిక ద‌ళానికి చెందిన సీ-130జే ప్ర‌త్యేక ర‌వాణా విమానం బ‌య‌లుదేరింది. దాంట్లో 85 మంది భార‌తీయులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ విమానం రీఫ్యుయ‌లింగ్ కోసం త‌జ‌కిస్తాన్‌లో ల్యాండ్ అయిన‌ట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. స్టాండ్‌బైగా కూడా మ‌రో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. అలానే మరో ట్రాన్స్‌పోర్ట్ విమానం సిద్ధంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

సీ-17 విమానంలో సుమారు180 మంది భార‌తీయుల్ని తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కాబూల్ న‌గ‌రం తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న‌ది. అయితే ఎంత మంది విమానాశ్ర‌యానికి చేరుకుంటారో చెప్ప‌లేం. ఎయిర్ ఇండియా విమానాలను ఆప‌రేట్ చేయ‌డం క‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో కేవ‌లం వాయుసేన విమానాల‌ను న‌డ‌ప‌నున్నారు. (చదవండి: Afghanistan: ఆశలు ఆవిరి.. వారి 'ఖేల్‌' ఖతం..)

వీలైనంత ఎక్కువ మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దౌత్యకార్యాలయ్యాల్లో పని చేస్తున్న సిబ్బందిని తరలించగా.. మరో 1000 మంది వేర్వేరు అఫ్గన్‌ నగరాల్లో చిక్కుకున్నటు ప్రభుత్వం భావిస్తోంది. వారందరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది గుర్తించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రస్తుతం అఫ్గన్‌లో ఉన్న ఓ గురుద్వారాలో 200 మంది హిందువులు, సిక్కులు శరణార్థులుగా ఉన్నట్లు సమాచారం. 

చదవండి: Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు