మొదటిసారి ఎయిరిండియాకు మహిళా సీఈఓ

31 Oct, 2020 12:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా చరిత్రలో మొదటిసారి ఒక మహిళ సీఈఓ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్‌ను ఎయిర్ ఇండియా ఛీఫ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు  హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్‌ సీఈఓగా వ్యవహరిస్తారని దానిలో పేర్కొ‍న్నారు. హర్‌ప్రీత్‌ ఎ డే సింగ్‌ ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (విమాన భద్రత)గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్థానంలో, ఎయిర్‌ ఇండియా నూతన ఈడిగా కెప్టెన్ నివేదా భాసిన్ పనిచేయనున్నారు.  నివేదా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో పనిచేస్తున్న సీనియర్ కమాండర్లలో ఒకరు. కెప్టెన్ నివేదా బాసిన్‌ను మరికొన్ని విభాగాలకు కూడా నాయకత్వం వహించాలని ఎయిర్‌ ఇండియా కోరింది. 

హర్‌ప్రీత్ సింగ్ 1988లో ఎయిర్‌ ఇండియాకు ఎంపిక అయిన మొట్టమొదటి మహిళ పైలెట్‌. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె విమానంలో ప్రయాణించలేకపోయినప్పటికి, విమానాల భద్రత విషయంలో చాలా చురుకుగా వ్యవహరించేవారు. ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్‌కు సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ అసోసియేషన్‌లో భాసిన్, కెప్టెన్ క్షమాతా బాజ్‌పాయ్ వంటి ఇతర సీనియర్ మహిళా కమాండర్లు ఉన్నారు. వీరందరూ నేటితరం పైలట్‌లకు రోల్‌ మోడల్స్‌గా ఉన్నారు. 

చదవండి: బంగారు స్వీట్‌.. ధర వేలల్లో.

మరిన్ని వార్తలు