ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్‌ ఇండియా సీఈఓ

7 Jan, 2023 16:05 IST|Sakshi

తీవ్ర కలకలం రేపిన తోటీ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనపై ఎయిర్‌ ఇండియా సీఈఓ స్పందించారు. సీఈవో క్యాప్‌బెల్‌ విల్సన్‌ శనివారం ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి నలుగురు క్యాబిన్‌ సిబ్బంది, పైలెట్‌ని తొలగించినట్లు తెలిపారు. అలాగే విమానంలో మద్యం అందించే విషయంలో ఎయిర్‌లైన్‌ విధానాన్ని కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఘటన వేదన కలిగించిందన్నారు. ఎయిర్‌ ఇండియా గాల్లో ఉన్నప్పుడూ భూమ్మీ మీద సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తుందని, ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవడానికే కట్టుబడి ఉందని అన్నారు. ఆయన ఈ విషయంలో సెటిల్‌మెంట్‌తో సంబంధం లేకుండా అన్ని సంఘటనలను కూలంకషంగా వివరించాలని సదరు విమాన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధ్యతయుతమైన ఎయిర్‌లైన్‌ బ్రాండ్‌గా ఎయిర్‌ ఇండియా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మెరుగుపరిచే కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అంతేగాక విమానంలో ఆల్కహాల్‌ సర్వీస్‌ పాలసీని కూడా సమీక్షిస్తున్నట్లు పరోక్షంగా వివరించారు.

ఇలాంటి సంఘటనలు మాన్యువల్‌గా ఉన్న పేపర్‌ ఆధారిత రిపోర్టింగ్‌ని మరింత మెరుగుపరిచేలా సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించే సాఫ్ట్‌వేర్‌ కోరుసన్‌ లైసన్స్‌ పొందడం కోసం మార్కెట్‌ లీడింగ్‌ ప్రోవైడర్‌లో సంతకం చేసినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తోపాటు పైలట్లు, సీనియర్‌ సిబ్బంది క్యాబిన్‌లకు ఐప్యాడ్‌లను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇలాంటి ఘటనలను ఎలక్ట్రానిక్‌ పరికరాలతో రికార్డు చేయడమే గాక సంబంధింత అధికారులకు వేగవంతంగా సమాచారాన్ని నివేదించగలుగుతారని చెప్పారు.

అందువల్ల ఎయిర్‌ ఇండియా కూడా బాధిత ప్రయాణికులకు తక్షణమే సాయం అందించడమే కాకుండా వారిని రక్షించగలుగుతుందన్నారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎయిర్‌ ఇండియా, దాని సిబ్బంది నియంత్రణాధికారులకు, చట్టాన్ని అమలు చేసే అధికారులకు సహకరించడమే గాక బాధిత ప్రయాణికులకు పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. అలాగే ఎయిర్‌ ఇండియా, కస్టమర్లకు, విమాన సిబ్బందికి సురక్షిత వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని ఎయిర్‌ ఇండియా సీఈవోవిల్సన్‌ చెప్పుకొచ్చారు. 
 

మరిన్ని వార్తలు