ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ప్రమాదం‌

9 Apr, 2021 10:42 IST|Sakshi

కేరళ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాలికట్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కార్గో కంపార్ట్‌మెంట్‌లో ఫైర్ హెచ్చరిక రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమాన ఫైలట్‌ విమానాన్ని కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ‌ విమానాశ్రయంలో అత్యవసరంగా  ల్యాండ్‌ చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా అధికారులు ప్రకటించారు. విమానంలో 17మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.  అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎవరికీ  ఎలాంటి ప్రమాదం జరగకపోవడతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

( చదవండి: విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు