గ‌ర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లిన ఎయిరిండియా పైల‌ట్.. తరువాత ఏం జరిగిందంటే!

21 Apr, 2023 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులే అనుకుంటే తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ పెలైట్‌ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దుబాయి-ఢిల్లీ విమానంలో  ప్రయాణిస్తున్న తన స్నేహితురాలిని పైలట్‌ కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. దుబాయి నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో పైలట్‌  స్నేహితురాలు కూడా ప్రయాణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పైలట్‌.. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు.
చదవండి: వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్‌-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే..

అంతేగాక విమానం ఢిల్లీకి చేరుకునేంతవరకు అంటే.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్‌పిట్‌లోనే ఫస్ట్‌ అబ్జర్వర్‌ సీట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై క్యాబిన్‌ సభ్యుల్లో ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో మ‌హిళా స్నేహితురాలిని పైల్‌ కాక్‌పిట్‌లోకి అనుమ‌తించిన ఘటనపై   పౌర‌విమాన‌యాన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (డీజీసీఏ) శుక్రవారం ద‌ర్యాప్తును చేప‌ట్టింది.

పైలట్ చర్యలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా, విమాన ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, దాని బట్టి పైలట్‌పై సస్పెన్షన్ లేదాలైసెన్స్‌ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు