ఎయిర్‌ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్‌

21 Jan, 2023 16:43 IST|Sakshi

ఎయిర్‌ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్‌లైన్‌ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్‌ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ‍ప్రశ్నించగా ఫ్లైట్‌ ల్యాండ్‌ అయిన వెంటనే  తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్‌ ఇండియాలోని టాప్‌ మేనేజ్‌మెంట్‌  గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తోసహా ఎయిర్‌లైన్స్‌ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్‌ వెళ్లాయి.

ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్‌ సూపర్‌వైజర్‌ నవంబర్‌ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఎఫ్‌సీడీ), హెచ్‌ఆర్‌ హెడ్‌కి ఈమెయిల్‌ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్‌ కేర్‌ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్‌ చర్చల అనంతరం ఈమెయిల్స్‌ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్‌ విభాగం ఇన్‌ఫ్లైట్‌ సర్వీస్‌ హెడ్‌లకు ఈమెయిల్స్‌ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్‌ అందుకున్న విల్సన్‌ కస్టమర్‌ కేర్‌ ఆ మెయిల్స్‌ ఫార్వర్డ్‌ చేసి తనకు వచ్చిన మెయిల్స్‌పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి.

అయితే ఎయిర్‌ ఇండియా మేనేజింగ్‌ డ్రైరెక్టర్‌(సీఎండీ) క్యాంప్‌బెల్‌ విల్సన్‌ మాట్లాడుతూ..ఎయిర్‌లైన్‌ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్‌ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్‌ నిందితుడు శంకర్‌ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్‌ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్‌ ల్యాండ్‌ అయిన వెంటనే శంకర్‌ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్‌గా ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిష్క్రమించినట్లు తేలింది.

ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్‌ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ  విమానయాన సంస్థ మరియు దాని చీఫ్‌లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇ‍ప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్‌ ఇన్‌ కమాండ్‌ లైసెన్స్‌ మూడు నెలలపాటు సస్పెన్షన్‌ తోపాటు ఎయిర్‌ ఇండియా డైరెక్టరేట్‌ ఇన్‌ఫ్లైట్‌ సర్వీస్‌కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

(చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్‌.. భారీ పెనాల్టీ)

మరిన్ని వార్తలు