ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు

24 Mar, 2021 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్‌ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. 

ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు.

చదవండి:

ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం!

వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!

మరిన్ని వార్తలు