భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్‌ మృతి.. బాయ్‌ఫ్రెండ్‌ అరెస్ట్‌

13 Mar, 2023 19:36 IST|Sakshi

బెంగళూరు: ఎయర్‌హోస్ట్‌ భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరుమంగళలో రేణుకా రెసిడెన్సీలోని అపార్ట్‌మెంట్‌లో ఎయిర్‌ హోస్ట్‌ అర్చన ధీమాన్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఆదేశ్‌తో కలిసి నివసిస్తోంది. ఆదేశ్‌ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి డేటింగ్‌ సైట్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. గత ఆరు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు.

కాగా ఎయిర్‌హోస్ట్‌ అర్చన మృతిలో ఆదేశ్‌ పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయని  ఆదేశ్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. 

ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపాడు.  ఆరోజు అర్చన నాల్గో అంతస్థు బాల్కనీ నుంచి జారిపడిందని, తాను ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో ఈ ప్రమాదానికి నాలుగు రోజుల ముందే అర్చన దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు.

(చదవండి: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు)

మరిన్ని వార్తలు