మృతుల ​కుటుంబాలకు ఎయిరిండియా పరిహారం

8 Aug, 2020 15:07 IST|Sakshi

సాక్షి,తిరువనంతపురం: కేరళ కోళీకోడ్  విమాన ప్రమాదంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదిగా అభివర్ణించింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. (కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే రిగింది)

12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మృతుల కుటుంబాలకు 10లక్షల  రూపాయలు, 12 ఏళ్లలోపు మృతుల కుటుంబీకులకు 5 లక్షల రూపాయలు చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించనున్నామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చెల్లిస్తామని పేర్కొంది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ప్రయాణీకులకు తగిన సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1800222271టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది.  (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం)

మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. 10 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు చెల్లిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. (విమాన ప్రమాదం : కరోనా కలకలం)

మరిన్ని వార్తలు