ఇంతకీ ఐపీఎస్‌ అధికారి సూట్‌ కేస్‌లో ఏముందో తెలుసా!

17 Mar, 2022 16:06 IST|Sakshi

Airport Security Opens IPS Officer Suit Case: నిజానికి చాలా పన్నీ ఇన్సిడెంట్‌లను చూస్తే కాస్త ఆశ్చర్యంగానూ, కామెడిగానూ ఉంటుంది. పైగా కొంతమంది అమాయకంగా చేస్తారో లేక సరదాగా చేస్తారో తెలియదు గానీ కొన్ని ఇషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది.

వివారల్లోకెళ్తే.. జైపూర్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఒక ఐపీఎస్‌ అధికారి అరుణ్ బోత్రా సూట్‌కేస్‌ని తెరిచి చూపించాల్సిందిగా కోరారు. భద్రతా దృష్ట్యా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్యాగ్‌లను ఓపెన్‌ చేయమని చెబుతుంటారు. ఆ విధంగా ఆ ఐపీఎస్‌ అధికారి సూట్‌కేస్‌ని ఓపెన్‌ చేయమని అడిగారు. అయితే అరుణ్ బోత్రా తన సూట్‌ కేస్‌ ఓపెన్‌ చేయగానే సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత అక్కడంతా ఒకేటే నవ్వులు. ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏమున్నాయంటే పచ్చి బఠాణిలు. సూట్‌కేస్‌ మొత్తం బఠాణిలతో నిండి ఉంది. అయితే ఆయన ఆ బఠాణిలను కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన" జైపూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది నా బ్యాగ్‌ని ఓపెన్‌ చేయమన్నారు" అనే క్యాప్షన​ జోడించి మరీ ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతోపాటు జరిగిన విషయాన్ని  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌గా మారింది.

(చదవండి: సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?)

మరిన్ని వార్తలు