రైతుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

23 Aug, 2022 11:54 IST|Sakshi

లక్నో: లఖింపూర్‌ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే.

ఈ నేపధ్యంలో మంత్రి అజయ్‌ మిశ్రా  లఖింపూర్‌ ఖేరీలో తన మద్దతుదారులను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ....సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుక్కులు మొరగడం, కారుని వెంబడిచడం గురించి ప్రస్తావిస్తూ...వాటి స్వభావం అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి రైతు నేత గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రైతులుగా పిలవబడుతున్నవారు పాకిస్తాన్‌ లేదా కెనడాలో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు లేదా ఉగగ్రవాదులు అంటూ విరుచుకుపడ్డారు.

ఆఖరికి మీడియా కూడా వారితో కలిసి తనపై ఇలా దుష్ప్రచారం చేస్తుందని  కలలో కూడా ఊహించుకోలేదని అ‍న్నారు. బహుశా మీడియాకి కూడా ఇదే బలమనకుంటా, అయినా మీడియా కారణంగా ప్రజలు ఎప్పటికీ తనను ఎలా ఓడించాలో తెలుసుకోలేరంటూ ఎగతాళి చేశారు. ఏనుగు ఎప్పుడూ తన దారిన తను వెళ్తుంటుంది, కుక్కలే ఎప్పుడూ మొరుగుతాయని వ్యగ్యంగా అన్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.."తాను లక్నోకి కారులో ప్రయాణిస్తున్నాను, అప్పుడు కారు మంచి వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో కుక్కలు మొరుగుతాయి లేదా వెంబడిస్తాయి. అది వాటి సహజ స్వాభావం.  ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ నిరాశపరచలేరు. ఎంతమంది రాకేష్ తికాయత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి , పైగా అతని రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదు. తానే ఏ తప్పు చేయలేదంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను తాను ప్రపంచంతో పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు.

(చదవండి: 6న ఎస్‌కేఎం తదుపరి భేటీ)
 

మరిన్ని వార్తలు