మా డౌట్లు తొలగించండి

5 Jan, 2021 05:40 IST|Sakshi

టీకాపై ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌

లక్నో: కోవాగ్జిన్‌పై వస్తున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన∙కోవాగ్జిన్‌ టీకాకు కేంద్రప్రభుత్వ అనుమతి లభించడంపై కాంగ్రెస్‌ సహా పలువురు ప్రశ్నించడం తెల్సిందే. తానుగానీ, తన పార్టీగానీ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ప్రశ్నించమని, కానీ ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వాటికి సరైన సమాధానాలివ్వాలని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆదివారం అనుమతినిచ్చింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఫేజ్‌ 3 ట్రయల్స్‌ పూర్తి కాకుండా వాడుకకు అనుమతినివ్వడం రిస్క్‌ అని విమర్శించాయి.   వ్యాక్సినేషన్‌ అనేది లక్షలాది మంది జీవితాలతో కూడిన విషయమన్నారు. పేదలకు వ్యాక్సిన్‌ అందించే తేదీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌నేత శశిధరూర్‌ సైతం వ్యాక్సిన్‌ అనుమతులను విమర్శించారు.

 

మరిన్ని వార్తలు