ట్రాక్టర్‌‌ ర్యాలీకి డీజిల్‌ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్‌ యాదవ్‌

25 Jan, 2021 13:51 IST|Sakshi

లక్నో: రేపు ట్రాక్టర్‌ ర్యాలీకీ డీజిల్‌ ఇవ్వద్దంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన అదేశాలను సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ ఖండించారు. ట్రాక్టర్లకు డీజిల్ పంపిణి చేయోద్దనడం ఇది కుట్ర పూరిత చర్య అని ఆయన ఆరోపించారు. రేపు గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టే కిసాన్‌ మార్చ్‌  ట్రాక్టర్ల భారీ ర్యాలీకి డీజిల్‌ను నిషేధిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ పంపులకు యోగి ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భగా అఖిలేష్‌ యాదవ్ స్పందిస్తూ యూపీ ప్రభుత్వంపై ట్వీటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘రేపు రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్లకు డీజిల్‌ను నిషేధించాలని యూపీ సర్కారు అన్ని పెట్రోల్‌ పంపులను ఆదేశించిందని విన్నాము. ఒకవేళ దీనిపై రైతులు స్పందిస్తూ బీజేపీని అడ్డుకుంటే యోగి ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇది రైతులపై బీజేపీ కుట్ర’ అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి గ్రీన్‌ సిగ్నల్‌)

అయితే అదే రోజున నిరసనలో ఉన్న రైతులంత దేశ రాజధానీలోని కవాతులో కూడా పాల్గొనవలసి ఉంది. కాగా జనవరి 26న దేశ రాజధానిలో జరిగే ‘కిసాన్ పరేడ్’కు ఢిల్లీ పోలీసుల అనుమితినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. (చదవండి: రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం)

మరిన్ని వార్తలు