లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్‌ రాజీనామా

23 Mar, 2022 07:10 IST|Sakshi

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్‌ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేశ్‌ చెప్పారు. ఎస్‌పీకి అఖిలేశ్‌ తండ్రి ములాయం సహా లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. 

చదవండి: (చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్‌ చిట్‌)

మరిన్ని వార్తలు