ఆ సార్‌కి.. డ్యూటీ కంటే మద్యం ముద్దు

12 May, 2022 08:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రభుత్వ పనిని దేవుని పనిగా భావిస్తారు. అయితే ఆ పని వదిలేసి ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడిపోయాడో ఉద్యోగి. ఈ సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. సంజు బెన్నె గొరవనకొళ్ల గ్రామ విలేజ్‌ అకౌంటెంట్‌గా ఉన్నాడు. అయితే విధులకు సరిగా హాజరవకుండా మద్యం తాగి వస్తుండడంతో అతన్ని అక్కడి నుండి తాలూకాఫీసుకు మార్చారు. ఇక్కడా అదే తంతు.

తాగిన మ­త్తులో ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తు­న్నా­డు. బుధవారం కూడా మద్యం తాగి వాహ­నాలు పార్కింగ్‌ చేసే చోట పడిపోయా­డు. ఇ­టువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసీల్దార్‌ను డిమాండు చేశారు.

చదవండి: పిల్లల్ని కంటారా... లేదంటే ఐదు కోట్లిస్తారా?

మరిన్ని వార్తలు