Holy 2022: సంబరాలు, డీజే, శ్రీవల్లీ, భీమ్లా హంగామా వైరల్‌ వీడియోలు

18 Mar, 2022 13:20 IST|Sakshi

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సందడి జోరుగా సాగుతోంది. రంగులను చల్లుకుంటూ, డీజే డ్యాన్స్‌లతో పిల్లా పెద్దా అంతా ఆడిపాడుతున్నారు. ‘హ్యాపీ హోలీ’ నినాదాలతో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు అందించుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా  సంబరాలకు దూరమైన ప్రజలు ఈ హోలీని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు. స్నేహితులు,  సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. 

క శ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని బోనియార్‌లో ఇండియన్ ఆర్మీ జవాన్లు హోలీని జరుపుకున్నారు. అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు లాఠ్‌మార్‌  పేరుతో   హోలీని జరుపుకుంటారు, బిహార్‌లోని పాట్నాలో ఒకరిపై ఒకరు పాదరక్షలు విసురుకుంటూ హోలీ జరుపుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.  దీంతోపాటు హోలీ  సందర్భంగా కొన్ని ఉత్సవాల వీడియోలు, ఇతర జోయ్‌ఫుల్‌  అండ్‌ ఫన్నీ  వీడియోలు కోసం..

మరిన్ని వార్తలు