వీడియోపై జోరుగా ప్రచారం: దెయ్యం! ఏలియన్​! లేక..

1 Jun, 2021 09:12 IST|Sakshi

రాత్రిపూట బ్రిడ్జ్​పై వింత ఆకారం తిరుగుతున్నట్లు వీడియో ఒకటి ఇంటర్నెట్​లో​, మీడియా చానెల్స్​లో కథనాలు ప్రసారం అవుతోంది. ఆ టైంలో కొందరు బైకర్స్​ వీడియో తీసి వైరల్ చేయడంతో అది అంతటా పాకింది. అది ఏలియన్​ అని కొందరు, కాదు బ్రిడ్జ్​ దగ్గర్లో శ్మశానం ఉండడంతో దెయ్యం అని మరికొందరు  ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.

రాంచీ: బ్రిడ్జ్​ మీద వింత ఆకారం పేరుతో వీడియో ఒకటి విపరీతంగా షేర్​ అవుతున్న విషయం తెలిసిందే. హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్​ మీద ఇది జరిగిందని ప్రచారం నడుస్తోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని అక్కడి లోకల్ మీడియా ఛానెల్స్ కథనాల్ని ప్రచురించాయి. దీంతో పంజాబ్​ కేసరి ఫేస్​బుక్​ ఛానెల్ ఆ వీడియోను అప్​లోడ్​ చేసి.. వింత ఆకారం సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారంటూ పోస్టులు పెట్టడంతో మెయిన్​ స్ట్రీమ్​ మీడియాకు విషయం చేరింది.


అయితే వైరల్ వీడియో తమ దృష్టిలోకి వచ్చిందని హజారిబాగ్​లోని పెలావాల్​ స్టేషన్ ఇన్​ఛార్జి వికర్ణ కుమార్​ తెలిపారు. ‘‘సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్​ బ్రిడ్జ్​ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్​ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఇక ఫ్రాంక్​ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఆ బ్రిడ్జ్​కి వంద మీటర్ల దూరంలో  ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్​ చేసి ఎవరైనా ఉత్త ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి వీడియోను అయినా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేమోనని.. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు.

జోకులు
రాత్రి పూట బ్రిడ్జ్​పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్​ వైరల్ వీడియోపై సోషల్​ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్​స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్​ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే..  ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్​ మస్క్​కి ట్యాగులు చేస్తున్నారు.

చదవండి: మోదీసార్​.. మాకెందుకీ కష్టాలు

మరిన్ని వార్తలు