వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..

24 Jul, 2020 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: మాస్క్‌లను, చేతి తొడుగులను వాడిన తరువాత, వాటిని ముక్కలుగా కత్తిరించి కనీసం 72 గంటల పాటు పేపర్‌ బ్యాగ్‌లలో ఉంచి, ఆ తరువాత మాత్రమే పారవేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా విడుదల చేసిన కోవిడ్‌–19 మార్గదర్శకాల్లో పేర్కొంది. వాణిజ్య సంస్థలు, షాపింగ్‌ మాల్స్, కార్యాలయాలు, సంస్థల్లో సాధారణ జనం వాడిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ముక్కలుగా చేసి, ప్రత్యేక బిన్‌లో మూడు రోజుల పాటు ఉంచిన తరువాత, మామూలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో తెలిపారు. బయో మెడికల్‌ వేస్ట్‌ని పసుపురంగు బ్యాగుల్లో వేయాలని, ఈ పసుపు రంగు బ్యాగులను సాధారణ చెత్తను తీయడానికి వాడరాదని  వెల్లడించారు. అయితే కోవిడ్‌ రోగులు వాడిన ఖాళీ వాటర్‌ బాటిల్స్, మిగిలిపోయిన ఆహారాన్ని బయో మెడికల్‌ వేస్ట్‌తో కలపరాదని, సాధారణ చెత్తతో పాటే వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు