ముంబైలో రెండు రోజుల పాటు అన్ని బంద్‌!

4 Aug, 2020 09:30 IST|Sakshi

ముంబై: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.  మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేసింది.  రాబోయే రెండు రోజుల్లో ముంబై,  దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో అనేక సేవలకు అంతరాయం కలిగింది. గత 10 గంటల్లో ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముంబై మున్సిపల్‌కార్పొరేషన్ తెలిపింది. ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలతో అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటికి ముంబై ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప రెండు రోజుల పాటు ఎవరు  ఇళ్లు దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. 

చదవండి: బిహార్‌కు మరో చేదు వార్త

మరిన్ని వార్తలు