అఖిలపక్షం భేటీ: ‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’

28 Nov, 2021 18:02 IST|Sakshi

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి

సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అఖిలపక్షం ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశానికి దేశంలోని 32 పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్‌ సభ స్పీకర్ అనుమతితో అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సాగుచట్టాల వ్యతిరేకిస్తూ జరిపిన ఆందోళనలో మృతి చెందిన రైతులు, కరోనా మృతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

చదవండి: పార్లమెంట్‌లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు

రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయామన్న ప్రధాని మోదీ.. మరో రూపంలో వాటిని తీసుకువచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే ఈసారి జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు