నచ్చిన వారితో ఉండొచ్చు; సంచలన తీర్పు

3 Nov, 2020 08:38 IST|Sakshi

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌: యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఆచూకీ కనిపెట్టిన పూజా కుటుంబ సభ్యులు వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మేజర్లమైన తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు.  భర్తతోనే కలిసి ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు.

చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు