Amarnath Yatra Floods: అమర్‌నాథ్‌లో వర్షబీభత్సం.. 16 మంది యాత్రికుల మృతి.. మరో 40 మంది అదృశ్యం!

9 Jul, 2022 10:38 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఇప్పటిదాకా కనీసం 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ చెప్పారు.
చదవండి👉🏻గుజరాత్‌లో వరుణ విలయం

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరదల వల్ల ఆహార కేంద్రాలు, టెంట్లు దెబ్బతిన్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమర్‌నాథ్‌లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ప్రకటించారు. పదో బ్యాచ్‌ కింద శుక్రవారం ఉదయం 6,100 మందికి పైగా యాత్రికులు రెండు బేస్‌ క్యాంపుల నుంచి ఆమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు.  
చదవండి👉🏻Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ

 

మరిన్ని వార్తలు