భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అమర్‌నాథ్‌ యాత్ర ఎప్పుడంటే..?

27 Mar, 2022 17:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భక్తులకు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే అమర్‌నాథ్‌ యాత్రపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. జూన్‌ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, ఆదివారం జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను జూన్‌ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈసారి భక్తులకు దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో​ వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు