సోషల్‌ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్‌

3 Mar, 2021 12:54 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ మొబైల్‌ యాప్‌ ఐకాన్‌ లోగోలో సీక్రెట్‌గా మార్పులు చేసి కొత్త లోగోను ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ మధ్య మింత్రా లోగో వివాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచేలా ఆ లోగో ఉందని ఆరోపించడంతో దానిని కాస్తా మార్చి కొత్త లోగోను విడుదల చేశారు. అయితే ఆ పాత లోగోలో ఏముందని పరీక్షించి చూడగా అసలు సంగతి బయటపడింది. దీంతో నెటిజన్లు మిగతా షాపింగ్‌ యాప్‌ల లోగోలను కూడా గమనించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అమెజాన్‌ మొబైల్‌ యాప్‌ లోగోపై ఓ కన్నేసారు. బ్రౌన్‌ కాటన్‌ బాక్స్‌పై బ్లూ కలర్‌ టేప్‌ అతికించినట్లు ఉండి కింద స్మైల్‌ షేర్‌ బాణం ఉంటుంది. అది చూసిన కొందరూ నెటిజన్లు.. ఈ లోగో నాజీ నేత అడాల్ఫ్‌ హిట్లర్‌ మీసంలా ఉందంటూ విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు.

దీంతో అమెజాన్‌ లోగో ప్రపంచ వ్యాప్తంగా నెట్టింట వైరల్‌గా మారింది. అతేగాక పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో దీనిపై రచ్చ జరిగింది. ఇది కాస్తా అమెజాన్‌‌ కంట పడింది. వెంటనే స్పందించిన అమెజాన్‌ సీక్రెట్‌గా లోగోలో చిన్న మార్పు చేసింది. కొత్త లోగోలో ఆ బ్లూ టేపును కాస్తా పైకి మడిచినట్లుగా మార్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్లను తృప్తి పరిచేందుకు మా సంస్థ తరచూ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని పేర్కొన్నారు. అయినప్పటికి ఈ కొత్త లోగో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది అవతార్‌: ది లాస్ట్‌ ఎయిర్‌ బెండర్‌ ఆంగ్‌ తలపై ఉండే గుర్తులా ఉందంటూ నెటిజన్లు మళ్లీ పోల్చడం ప్రారంభించారు. 

చదవండి: స్వీట్‌ బాక్సులు పంచారు, వీధి మొత్తం దోచేశారు
         అమెజాన్‌ పార్సిల్‌ అనుకుంటున్నారా‌.. కాదండోయ్‌!
            పవర్‌ స్టార్‌ సినిమాను దక్కించుకున్న అమెజాన్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు