అంబులెన్స్‌ డ్రైవర్‌ అరాచకం..

26 Jul, 2020 09:22 IST|Sakshi

ఆపత్కాలంలో దోపిడీ

కోల్‌కతా : ప్రాణాంతక వైరస్‌ ప్రజలను వణికిస్తుంటే ఆపద సమయాన్నీ అవకాశంగా తీసుకుని కొందరు జేబులు నింపుకుంటున్నారు. కోల్‌కతాలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఏకంగా 9200 రూపాయలు డిమాండ్‌ చేశారు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ 2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్‌-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చైల్డ్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐసీహెచ్‌)లో చికిత్స పొందుతున్నారు.

మరుసటి రోజు వైద్యుల సూచనతో వారిని అక్కడి నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బాలుడి తండ్రి అంబులెన్స్‌ను పిలిపించారు. వారిని ఐసీహెచ్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కోల్‌కతా మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (కేఎంసీహెచ్‌)కి తరలించేందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ 9200 రూపాయలు డిమాండ్‌ చేశాడని ఆయన ఆరోపించారు. అంతమొత్తం చెల్లించలేమని తాను చెప్పగా ఏమాత్రం వినిపించుకోకుండా తన చిన్న కుమారుడికి ఆక్సిజన్‌ తొలగించడంతో పాటు వారిని అంబులెన్స్‌ దిగి వెళ్లాలని వేధించాడని చెప్పారు. ఐసీహెచ్‌ వైద్యులు జోక్యం చేసుకుని రూ 2000కు కేఎంసీహెచ్‌కు వారిని తరలించేలా చొరవ చూపారని పేర్కొన్నారు. చదవండి : కటకటాల్లో ‘కరోనా బాబా’

మరిన్ని వార్తలు