ఆజాద్‌ కశ్మీర్‌ సీఎం అవుతారు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ 

27 Aug, 2022 13:50 IST|Sakshi

Ghulam Nabi Azad.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌.. అందరికీ షాకిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాస్తూ.. రాహుల్‌ గా​ంధీ, కాంగ్రెస్‌ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి ప‌రిణితి లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల్లో వ‌రుస ఓట‌ములు ఎదుర‌య్యాయ‌ని పేర్కొన్నారు. 

కాగా, ఆజాద్‌ రాజీనామా తర్వాత.. అనూహ్యంగా ఆయనకు ఇతర పార్టీల నేతలు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే అమిన్‌ భట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అమిన్‌ భట్‌.. గులామ్‌ నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రాజ‌కీయంగా ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై తాము చ‌ర్చించామ‌ని, తాము బీజేపీకి బీ టీం కాద‌ని భ‌ట్ స్పష్టం చేశారు. అనంతరం.. ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్ సీఎం అవుతార‌ని అమిన్ భ‌ట్ కామెంట్స్‌ చేశారు. దీంతో, అమిన్ భ‌ట్ కామెంట్స్‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో గులామ్‌ నబీ ఆజాద్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అధిక ప్రాముఖ్యతనిచ్చింది. అందులో భాగంగానే పద్మభూషణ్‌తో సత్కరించింది. దీంతో, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆజాద్‌.. బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. ఈ క్రమంలో​ బీజేపీలో చేరికపై ఆజాద్‌ స్పందిస్తూ.. తాను బీజేపీలో చేర‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాన‌ని ఆజాద్ స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు ఎవరిచ్చారో తెలియదు.. లిస్ట్‌లో కాంగ్రెస్‌ టాప్‌!

>
మరిన్ని వార్తలు