పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగిన అమితాబ్‌

12 Oct, 2021 05:44 IST|Sakshi
సోమవారం ముంబైలో అభిమానులతో తన బర్త్‌డే వేడుకల్లో అమితాబ్‌ బచ్చన్‌

ముంబై: పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రకటించారు. బ్రాండ్‌ ప్రమోషన్‌కు కంపెనీ ఇచి్చన పైకాన్ని వెనక్కు ఇచి్చనట్లు తెలిపారు. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభిమానులు తమ స్టార్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బచ్చన్‌ వెనక్కు తగ్గారు. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో ఆఫీస్‌ ఆఫ్‌ అమితాబ్‌ బచ్చన్‌ పేరిట ఒక పోస్టు కనిపించింది. గతవారం బచ్చన్‌ ఈ ప్రకటన నుంచి తప్పుకున్నారని, ప్రచారానికి ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల అంగీకరించినట్లు పోస్టులో తెలిపారు.  పాన్‌ మసాలా బ్రాండ్లకు ప్రకటనకర్తగా వ్యవహరించవద్దని ఇటీవల ఎన్‌ఓటీఈ అనే పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌కు విజ్ఞప్తి చేసింది.   
 

మరిన్ని వార్తలు