ఆనంద్‌ మహీంద్రని మైమరిపించిన పులి వీడియో

12 Dec, 2020 22:04 IST|Sakshi
వీడియో దృశ్యం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ పులి వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. ఆ వీడియోను చూసిన ఆయన చిన్నప్పుడు దక్షిణ భారతంలో గడిపిన ఆనందక్షణాలను, తన బాల్య సమయాన్ని గుర్తుచేసుకున్నారు. జైరామ్‌ రమేష్ వాట్సాప్‌లో అందుకున్న ఈ వీడియోలో.. పులి ఓ ఇంటి పెరట్లో.. నీటితో నిండిన తొట్టెను చూసి, కాసేపు టబ్ చుట్టూ తిరుగుతూ, దాని చుట్టూ సంకోచంగా చూస్తూ, ఆపై వెంటనే నీటిలోకి దిగి కొద్దిసేపు సేదతీరింది. దాని పాదాలను తొట్టి అంచుకు ఉంచి త్వరగా తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్లు ఫోజ్‌ పెట్టింది. 

‘ఓ అరుదైన సంఘటన’ అని జైరామ్‌ రమేష్ డిసెంబర్ 7న ట్వీట్‌ చేశారు. మూడు రోజుల తరువాత ఈ వీడియోను చూసిన మహీంద్ర గ్రూప్‌ చైర్మెన్‌ రీట్వీట్‌ చేశారు. సెలవుల్లో నాగర్‌హోల్‌ ఆభయారణ్యం నుంచి ఆరు మైళ్ల దూరంలో ఉన్న కొడగులో తాను గడిపిన బాల్య క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటి వరకు పులిని చూసిందే లేదని, ఇందులో అతను ఇంకో దాన్ని చూడాలి అనుకుంటునన్నాడో లేదా తన కొడుగు రోజులను గుర్తు చేసుకుంటున్నాడో అస్పష్టంగా ఉంది. ఎప్పుడు అలా పులి చూడకపోవడంతో ఇది అతనికి చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. పులి బాడీ మసాజ్‌కి నీటి తొట్టెను ఉపయోగించడంతో అది ‘టికుజి’గా అయిందని ముగించారు. 

మరిన్ని వార్తలు