ష్‌.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్‌ మహీంద్రా

6 May, 2022 13:06 IST|Sakshi

Anand Mahindra Funny Tweet Reply: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. సోషల్‌ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటెరాక్టర్‌ కూడా. ఎవరేం అడిగినా.. చాలా ఓపికగా సమాధానం చెప్తుంటాడాయన. ఈ క్రమంలో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు.. మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ, ఫన్నీగా మాత్రం ఓ బదులు ఇచ్చారు ఆయన. 

ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి.. ‘‘సర్‌.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్‌ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్‌ మహీంద్రాకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

దీనికి ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్‌.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. 

సమాధానం అందుకున్న వ్యక్తి సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదుగానీ.. ఆనంద్‌ మహీంద్రా చేసిన ఈ  సరదా ట్వీట్‌ను మాత్రం పలువురు నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎవరు సార్‌ తీసేది అంటూ ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. అఫ్‌కోర్స్‌.. ట్విటర్‌లో ఆయన ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండడానికి ఇలాంటి టైమింగ్‌ కూడా ఒక కారణం కాబోలు!


ఇదిలా ఉండగా.. కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో.. అదీ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 చదవండి: నా స్కోర్‌ సున్నా.. అయినా గర్వంగా ఉంది

మరిన్ని వార్తలు