వైరల్‌: ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికిన రైతు

5 Aug, 2020 16:24 IST|Sakshi

ముంబై: ఓ రైతు ఇంజనీర్‌లా వినూత్న ఆలోచన చేశాడు. చేతులకు పని చెప్పకుండానే ట్రాక్టర్‌తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్‌ అధినేత‌ ఆనంద్ మహీంద్ర బుధవారం ట్విటర్‌లో‌ పంచుకున్నారు. ‘గ్రామాల్లో మా ట్రాక్టర్‌లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు. అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇంజనీర్‌ కానీవారు ఇలా చేయగలరా’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేశారు. (చదవండి: నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ..)

అయితే 1.12 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మహరాష్ట్రకు చెందిన ఈ రైతు ట్రాక్టర్‌ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు. నాబ్‌లను ఉపయోగించి ట్రాక్టర్‌ ఇంజన్‌ సాయంతో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా 2, 3 నిమిషాలలో పాలను పితకొచ్చు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరిని తెగ ఆకట్టుకుంటోంది. అతడి వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘అందుబాటులో ఉన్న సాంకేతికతను అతడు ఉపయోగించిన తీరు అద్భుతం’ అంటూ నెటజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వార్తలు