ఆనంద్ మహింద్రా షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌

12 Nov, 2020 14:41 IST|Sakshi

జీవితంలో ఆనందంగా ఉండటం నిజంగానే  కష్టమైన పనా? అసలు ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలి అంటూ మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఆనందం అనేది ఆన్‌లైన్‌లో దొరికే వస్తువు కాదు, అది స్వతహాగా మనమే పెంపొందించుకోవాలి ఇలాంటి పాజిటివ్‌ స్పిరిట్‌తో ఉన్న ట్వీట్‌ను గురువారం ఆనంద్‌ మహింద్రా షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహింద్రా..తాజాగా జీవిత పాఠానికి సంబంధించిన ఓ విలువైన పోస్టును  నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో..'ఇది (ఆనందం) నీకు ఎక్కడ దొరికింది? దీని కోసం నేను ప్రతీచోట వెతుకుతూనే ఉన్నాను అని ప్రశ్నించగా, ఎక్కడో లేదు..దీన్ని నేనే సృష్టించుకున్నాను' అంటూ మరొకరు సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన సింపుల్‌ లైన్‌ డయాగ్రమ్‌ను ఆనంద్‌ మహింద్రా ట్విట్టర్‌లో పోస్ట్ ‌చేయడం‍తో ఈ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.  (వైరల్‌: ‘పులి’ని చూసి పారిపోయిన జంతువులు! )

ఒక్క ఫోటో వెయ్యి పదాల కన్నా విలువైనది అంటారు కదా..అలాగే ఈ సింపుల్‌ డ్రాయింగ్‌ కూడా వెయ్యి చిత్రాలకంటే విలువైనది అంటూ ఓ క్యాప్షన్‌ను జతచేశారు. ఆనంద్‌ మహింద్రా షేర్‌  ‌చేసిన ఈ పోస్టుకు  కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. అవును. మీరు చెప్పింది నిజమే..ఆనందం అనేది స్పూన్‌ ఫీడింగ్‌ కాదు..దాన్ని మనమే సృష్టించుకోవాలి అంటూ ఓ యూజర్‌ పేర్కొనగా, సంతోషంగా ఉండటమన్నది చాలా సులభమైన విషయమే కానీ చాలామంది ఇదేదో కష్టమైన పని అని భావిస్తుంటారు అని మరొకరు రిప్లై ఇచ్చారు. (అతని పేరు చెప్పనందుకు సంతోషంగా ఉంది)

మరిన్ని వార్తలు