‘ఇది ఊహించిన వారికి బహుమతి లేదు’

14 Sep, 2020 16:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే తనకు ఎదురైన ఆసక్తికర విషయాలను తనదైన శైలిలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆదివారం తనకు వాట్సప్‌లో వచ్చిన రెండు ఫొటోలను ట్విటర్‌లో చేశారు. ఇందులో ఆయన 65 ఏళ్లు పైబడిన వారికి ఓ సలహా ఇచ్చారు. ‘ఈ రోజు నాకు వాట్సప్‌లో రెండు ఫొటోలు వచ్చాయి. ఈ రెండింటిలో 65 ఏళ్ల వారికి ఓదార్పు నిచ్చే సలహా ఉంది. అయితే దీనిని ఊహించిన వారికి బహుమతులు లేవు’ అంటూ తన ట్వీట్‌కు సరదా క్యాప్షన్‌ జోడించారు. (చదవండి: మాస్క్‌ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది)

ఆయన షేర్‌ చేసిన మొదటి చిత్రంలో "ప్రపంచంలోని 100 మంది వ్యక్తులలో, 8 మంది మాత్రమే 65 ఏళ్లు దాటి జీవించగలరు. మీకు 65 ఏళ్లు పైబడి ఉంటే, సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉండండి. జీవితాన్ని ఆనందించండి, క్షణం గ్రహించండి. మిగిలిన 92 మంది వ్యక్తుల లాగా మీరు 64 ఏళ్ళకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు. మీరు ఇప్పటికే మానవాళిలో ఆశీర్వదించబడ్డారు’ అని ఉంది. ఇక రెండవ చిత్రంలో పెరుగుతున్న వయస్సుతో, ప్రజలు కంటి చూపును కోల్పోతారు కానీ ఇతరులను అంచనా వేసి తీర్పు చెప్పే సామర్థ్యాన్ని పొందుతారు’ అని పేర్కొన్న ఈ పోస్టులు షేర్‌ చేసిన కొద్ది గంటలకే వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. (చదవండి: ఇలాంటి వింత కోరికను ఎప్పుడైనా విన్నారా!)

మరిన్ని వార్తలు