లాక్‌డౌన్‌ సడలింపులపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్

7 Jun, 2021 20:48 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సమకాలీన అంశాలపై స్పందిస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఆయన కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ పై చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. దేశంలోని ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితిని గుర్తుచేస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలోని సుమారు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కరోనా తీవ్రత క్రమ క్రమంగా తగ్గుతున్న సమయంలో కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. 

లాక్‌డౌన్‌ పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆనంద్ మహీంద్రా వ్యంగ్యంగా సమాధానమిస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఉన్న ఒక యువకుడు తలుపు గొళ్లానికి తాడు కట్టాడు. ఆ తాడుకు తాళం తగిలించి క్రిందకి, పైకి లాగుతున్నాడు. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నావని సదరు యువకుడిని అడిగితే.. లాక్‌డౌన్‌ అంటూ సమాధానమిచ్చాడు. అంటే తాళాన్ని కిందకు లాగుతున్నాను అని వ్యంగ్యంగా చెప్పాడు. ఈ వీడియోను చూసి అందరూ నెటిజన్లు నవ్వుతున్నారు. ఈ విధంగానే ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేద్దామా అని పాలకులు ఆలోచిస్తున్నట్లు ఆయన వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఏ కఠిన సంధర్భంలోనైన భారతీయులు హాస్యంగా మలుచుకోగలరు. ఈ కఠిన పరిస్థితులలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంచిది. ఇది మనకు మానసికంగా ఎంతో సాంత్వన చేకూర్చుతుంది” అని అన్నారు.

చదవండి: ఆన్‌లైన్‌లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు