'మ‌న ప‌రిస్థితి కూడా సీతాకోక‌చిలుకలాగే..'

1 Aug, 2020 19:47 IST|Sakshi

ముంబై : ‌క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌నుషులకు స్వేచ్ఛ త‌గ్గిపోయింద‌ని చెప్పొచ్చు. ఎందుంక‌టే లాక్‌డౌన్ పేరుతో ప్ర‌జ‌ల‌ను బ‌య‌టికి రాకుండా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొంత వ‌ర‌కు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాయి. దేశంలో అన్‌లాక్ మొద‌లైన త‌ర్వాత ఈ ప‌రిస్థితి కొంచెం మారినా.. మునుప‌టిలా మాత్రం క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డికైనా వెళితే క‌రోనా సోకే ప్ర‌మాదం ఉంద‌ని భ‌య‌ప‌డేవారు చాలామందే ఉన్నారు. అందుకే ఎవ‌రికి వారు త‌మ‌ రోజూవారి కార్య‌క‌ల‌పాలు చూసుకొని జాగ్ర‌త్త‌గా ఇంటికి తిరిగివ‌చ్చేస్తున్నారు. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత‌ ఎంజాయ్ అనే ప‌దం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది(ఎంజాయ్ చేసేవారు ఎప్ప‌ట్లానే చేస్తున్నార‌నుకోండి.. అది వేరే విషయం). ఎప్పుడు క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామా.. ఎంజాయ్ చేద్దామా అన్న ధోర‌ణిలో ప్ర‌జ‌లంద‌రి మైండ్‌సెట్ ఉంది. స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితినే తాను సీతాకోక‌చిలుక‌లో చూశానంటూ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా అంటున్నారు.(ఆన్‌లైన్ క్లాసుల కోసం మంగ‌ళ‌సూత్రం తాక‌ట్టు)

నిత్యం ఏదో ఒక ట్వీట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ శ‌నివారం ఒక ట్వీట్‌ షేర్ చేశారు. 'నా రూమ్‌లో ఒక పెద్ద‌ సీతాకోక‌చిలుక క‌నిపించింది. అది బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి తెగ ప్ర‌య‌త్నిస్తోంది. నేను వెంట‌నే దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి చేత్తో సీతాకోక‌చిలుక‌ను ప‌ట్టుకొని జాగ్ర‌త్త‌గా బ‌య‌టికి వ‌దిలేశాను. అది ఎంతో వేగంగా నా ఇళ్లు దాటి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.  అది చూడ‌గానే.. మ‌న ప‌రిస్థ‌తి కూడా సీతాకోక‌చిలుక‌లాగానే ఉంది. ఎప్పుడు ఈ క‌రోనా వైర‌స్ త‌గ్గిపోతుందో..  ఆ వైర‌స్ తలుపులు బ‌ద్ద‌లు కొట్టుకొని స్వేచ్ఛ‌గా బ‌య‌ట‌కు వెళ్తామా అనిపించింది.' అంటూ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.(ఈ వీడియో చూసి మ‌నం చాలా నేర్చుకోవ‌చ్చు!)

మరిన్ని వార్తలు