వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

11 Aug, 2020 17:59 IST|Sakshi

బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులన్నారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను అభివృద్ధి చేయడానికి సంస్థ ఉద్యోగులు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. వీరంతా దేశ ద్రోహులని హెగ్డే విరుచుకుపడ్డారు. (బై బై బీఎస్‌ఎన్‌ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి)

అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు హెగ్డే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కన్నది. బీజేపీ అసమర్థత వల్లే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించింది. కేంద్రం ప్రతిదానిని ప్రైవేటీకరిస్తుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు