రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం...ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పుపెట్టిన స్థానికులు: వీడియో వైరల్‌

24 Sep, 2022 14:05 IST|Sakshi
మంటల్లో​ రిషికేశ్‌లోని వనతార రిసార్ట్‌

Receptionist murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం పెద్ద కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. ఈ రిసెప్షనిస్ట్‌ హత్య కేసులో  బీజేపీ నేత వినోద్‌ కుమార్‌ ఆర్య కొడుకు పుల్కిత్‌ ఆర్య నిందితుడిగా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ మేరకు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర ధామీ ఈ ఘటన కఠిన చర్యల తోపాటు, నిందితుడి రిసార్ట్‌ని కూడా బుల్డోజర్లతో కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రిసార్ట్‌లో కొంతభాగాన్ని కూల్చివేశారు కూడా. అంతేగాక ఈ కూల్చివేతను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కూడా. పైగా ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేసేలా డీఐజీ పి రేణుకా దేవి నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

దీంతో పోలీసులు ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయడమే కాకుండా శనివారం ఉదయమే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహోజ్వాలాలు మిన్నంటాయి. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు పుల్కిత్‌ ఆర్య రిసార్ట్‌కి స్థానికులు నిప్పు పెట్టారు. ఐతే ప్రభుత్వమే ఒక పక్క కూల్చివేత పనులు ప్రారంభిస్తే ...మరోవైపు స్థానికులు కోపంతో రిసార్ట్‌లోని మిగిలిని భాగాన్ని తగలు బెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: రిసెప్టనిస్టు హత్యోదంతం...బుల్డోజర్లతో రిసార్ట్‌ కూల్చివేత..లైంగిక దాడి అనుమానాలు!)

మరిన్ని వార్తలు