కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్

12 Jan, 2022 16:41 IST|Sakshi

రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్‌: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. )

వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే  తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.

మరిన్ని వార్తలు