ఘోరం.. మీరు మనుషులా.. రాక్షసులా..

2 Jul, 2021 13:09 IST|Sakshi

తిరువనంతపురం: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే, చాలా మంది డాక్టర్లు కుక్కను పెంచుకోవడం వలన మానసిక సమస్యలు, ఒత్తిడి దూరమవుతాయని చెప్తుంటారు. అయితే, ఇలాంటి మూగ జీవిపట్ల కొంత మంది యువకులు ప్రవర్తించిన తీరు షాకింగ్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాలు.. కేరళలోని ఆదిమలాతురా అనే గ్రామానికి చెందిన క్రిస్తురాజ్‌ అనే వ్యక్తి లాబ్రాడార్‌ జాతికి చెందిన ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాన్ని ‘బ్రూనో’ అని ప్రేమగా పిలుచుకునేవాడు. ప్రస్తుతం దానికి 9 ఏళ్లు. వారి ఇల్లు బీచ్‌కి దగ్గరగా ఉంటుంది. బ్రూనోను క్రిస్తురాజ్‌ కుటుంబ సభ్యులు ప్రతిరోజు బీచ్‌కి వాకింగ్‌కి తీసుకెళ్తుంటారు. అది ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది. ఒకవేళ, కుక్క ఎప్పుడైనా, బయటకు వెళ్తె.. క్రిస్తు గట్టిగా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది.

ఈ క్రమంలో ఒకరోజు.. బ్రూనో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. క్రిస్తురాజ్‌ బ్రూనోను ఎంత పిలిచిన రాలేదు. చాలా సేపు గడిచిపోయింది. దీంతో,  క్రిస్తురాజ్‌ తనశునకాన్ని వెతుక్కుంటూ బీచ్‌ దగ్గరకు వెళ్లాడు. అయితే, అక్కడ సంఘటన చూసి షాక్‌కు గురయ్యాడు. అక్కడ ముగ్గురు యువకులు, బ్రూనోను, ఒక కొక్కెనికి వేలాడదీశారు. అంతటితో ఆగకుండా, ఒకరి తర్వాత మరొకరు ఆ కుక్కను అతి క్రూరంగా కొడుతున్నారు. పాపం.. అది ఆ దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతూ.. ప్రాణాలను విడిచింది. అది చూడగానే, వణికి పోయిన యజమాని ఏంచేయాలో తెలియక, ఆ సంఘటనను వీడియో తీశాడు.

ఇంటికి చేరుకున్న తర్వాత తన సోదరితో జరిగిన దారుణాన్ని చెప్పాడు. వెంటనే వారు, ఆ ముగ్గురు దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆ నిందితులను అదుపులోనికి తీసుకుని, జంతులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేశారు. అయితే,  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ దుర్మార్గులను చంపేయాలి..’, ‘మూగజీవి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు..’, ‘బ్రూనోకు న్యాయం జరగాలి..’ ‘ఘోరం.. మీరు మనుషులా.. రాక్షసులా..అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

చదవండి: అందుకే నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా.. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు